''ఉదయమున ఏడుగంటలకు లేచుట ఆచారము, అనుష్ఠానము లేదు. ఉన్నది తినుట, నిద్రపోవుట, ఇటుల మన మతమం దొకడు ఉండిన, అట్టి సోమరికంటె ''స్వామి లేడు. ఆత్మా లేదు-అంతా ఈ దేహమే'' అని చెప్పువాడు ఎంతయో శ్రేష్ఠుడు, అతడు తత్త్వవిచారణకు దిగెనుకదా! ఆత్మయున్నదా? లేదా? స్వామికలడా? లేడా? ఆను విచారణలోని కతడు దిగెను. అతడు కనుగొన్న తత్త్వము, ''స్వామి లేడనియే'' కావచ్చును. కాని అతడు ఏ విచారములేని సోమరికంటె గొప్పవాడేకాదా!'' |